calender_icon.png 8 September, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించిన దినేష్ రెడ్డి

07-09-2025 10:48:42 PM

అభినందించిన గ్రామస్తులు..

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలం(Gandepalli Mandal) అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు దినేష్ రెడ్డి ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించాడు. దినేష్ రెడ్డి నల్గొండ పట్టణంలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ చదువుతూ డిఫెన్స్ పై కోచింగ్ తీసుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన అనంతరం గత మే నెలలో ఆల్ ఇండియా నేవీ ఎస్.ఎస్.ఆర్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలో పాల్గొనగా ఆగస్టు నెలలో వచ్చిన ఫలితాల్లో దినేష్ రెడ్డి సీనియర్ సెకండరీ రిక్రూట్ అయ్యారు. దినేష్ రెడ్డి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నారాయణ సైదిరెడ్డి రజిత కుమారుడైన దినేష్ రెడ్డి నేవీలో ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఒడిస్సాలోని ఐఎన్ఎస్ చిలకలు ఈనెల 16వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉందని దినేష్ రెడ్డి తెలిపారు.

ఆయన ఎంపిక పట్ల రామయ్య డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రామయ్య, శ్రీనివాస్, సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకూబ్, మాజీ సర్పంచ్ చిలుక కాశయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు బంధువులు దినేష్ రెడ్డిని అభినందిస్తూ ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామయ్య డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రామయ్య మాట్లాడుతూ.. డిఫెన్స్ అకాడమీ నుంచి ప్రతి ఏడాది అత్యధిక సంఖ్యలో ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లలో ఎంపిక అవుతున్నట్లు తెలిపారు. డిఫెన్స్ అకాడమీలో ఒక సంవత్సరం జాబ్ కోర్స్ ఎంచుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ ఉంటుందన్నారు. ఇండియన్ నేవీకి ఎంపికైన దినేష్ రెడ్డి తన పడిన కష్టానికి ఫలితం సాధించారని అతని కష్టానికి తల్లిదండ్రులు ఎంతో సహకారాన్ని అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డిని ప్రత్యేకంగా ఆయన అభినందించారు.