calender_icon.png 8 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రగడ్డలో వదిలేసిన విగ్రహాలను నిమజ్జనం చేసిన భాగ్యనగర్ గణేష్ సమితి

07-09-2025 11:13:19 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా ఎర్రగడ్డలో గణేశ్ విగ్రహాల విక్రేతలు అమ్మకాలు ముగిసిన తర్వాత మిగిలిపోయిన, పగిలిపోయిన విగ్రహాలను వాష్‌రూమ్స్ దగ్గర నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు. ఈ విషయాన్ని గమనించిన పోలీస్ విభాగం విక్రేతలకు విగ్రహాలను ఇలా వదిలేయొద్దని హెచ్చరించినప్పటికీ, వారు పట్టించుకోకుండా అలాగే వదిలేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఈ పరిస్థితిని గమనించిన భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి సభ్యులు వారణాసి కార్తీక్ ముందుకు వచ్చి, ఆ విగ్రహాలను సేకరించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, గణేశ విగ్రహాలను వ్యాపార వస్తువుల్లా చూసి పగలగొట్టి వదిలేయడం బాధాకరం అని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సమాజం మొత్తం అరికట్టాలి అని పిలుపునిచ్చారు.