07-09-2025 08:20:54 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
వలిగొండ (విజయక్రాంతి): ప్రభుత్వం ఏరియా కొరత వివరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి(CPI District Secretary Yanala Damodar Reddy) అన్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో మండల కౌన్సిల్ సమావేశం సల్వాద్రి రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యూరియాను కృత్రిమ కొరతను కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యూరియాను రాష్ట్రానికి సరఫరా చేయాలని రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ఫెర్టిలైజర్ యజమానులు బ్లాక్ లో యూరియాను అమ్ముకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారని వారిపై వ్యవసాయం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోలోగోని సత్యనారాయణ, చెడే చంద్రయ్య, బోడ సుదర్శన్, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్ తదితరులు పాల్గొన్నారు.