07-09-2025 11:02:27 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో అడవి పంది మాంసంతో ఐదుగురు వ్యక్తులను ఆదివారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముందస్తు సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు చర్లపల్లి గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురు వ్యక్తుల వద్ద అడవి పంది మాంసం లభించింది. అడవి పందిని వేటాడిన హేమంత్, ప్రవీణ్, వి కిరణ్, జీ కిరణ్, అరుణ్ లను డిఆర్ఓ గౌరీశంకర్, ఎఫ్ ఎస్ ఓ శ్రీనివాసు, సువర్ణ, ఎఫ్ బి ఓ గోపికృష్ణ లు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు నిమిత్తం అడవి పంది మాంసాన్ని, నిందితులను బెల్లంపల్లి రేంజ్ ఆఫీస్ కి తరలించారు.