21-11-2025 04:32:40 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు చిన్నతనం ఉండే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కేసముద్రం ఎస్ఐలు క్రాంతి కిరణ్, నరేష్, ఎంఈఓ యాదగిరి ఉద్బోధించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ లో కేసముద్రం స్టేషన్ హై స్కూల్ కు చెందిన బి.శ్రీకాంత్, ఎం నితీష్ ఎండి ఆఫ్ రా ప్రైవేట్ పాఠశాలల నుండి మొదటి బహుమతి శ్రీ వివేకవర్ధిని పాఠశాలకు చెందిన ఆర్.రఘువీర్, జి. శ్రీవిద్య, ఓం సాయి, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన ధరణి, నిఖిత, రమ్య ఎంపికయ్యారు. జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించుటకు ఇలాంటి టెస్ట్ ల్లో విద్యార్థులు పాలుపంచుకోవాలన్నారు.