21-11-2025 04:24:51 PM
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా –ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
దేవరకొండ,(విజయక్రాంతి): కొండ మల్లెపల్లి మండలం గాజీనగర్ తండాలో 3 కోట్లు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వ్యవసాయ రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందేందుకు స్థిరమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం అని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
గాజీనగర్ ప్రాంతంలో ఉన్న లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా నివారించి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు.ఒక సంవత్సరంలో దేవరకొండ నియోజకవర్గానికి 7 సబ్ స్టేషన్లు మంజూరు చేయించామని, అందులో పోగిళ్ళ, మేడారం, గాజీనగర్ సబ్ స్టేషన్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.