calender_icon.png 21 November, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వల మోడల్ స్కూల్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి

21-11-2025 04:46:24 PM

అదనపు కలెక్టర్ కు ఎస్ఎఫ్ఐ నేతల విజ్ఞప్తి

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులుగా నిరసన చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి‌ జ్యోతి బసు, పట్ల మధు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హాస్టల్  నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని, వంట వండి పెట్టడం లేదని, విద్యార్థులే శుక్రవారం టిఫిన్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అదనపు కలెక్టర్ కు వివరించారు.

విద్యార్థులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని ఎస్.ఓ, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ సింహాద్రి, పట్టణ కార్యదర్శి భాషిపాక పవన్, పట్టణ నాయకులు నవీన్, తాజ్, సన్నీ, జస్వంత్ పాల్గొన్నారు.