21-11-2025 04:43:58 PM
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్నగర్ పట్టణంలో ఫిట్ ఇండియా వారి ఆధ్వర్యంలో 5K రన్ ఆరోగ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 23 (ఆదివారం) ఉదయం 7:00 గంటలకు ప్రారంభం కానున్నది. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం, ఈ ప్రత్యేక కార్యక్రమానికి అందరినీ సాదరంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఆరోగ్యమే నిజమైన మహాభాగ్యం అన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ 5K రన్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.