calender_icon.png 26 November, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ఘనంగా సన్మానం

26-11-2025 07:12:23 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో బుధవారం జరిగిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డిని ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరి పద్మ మహేందర్ దంపతులు మెమొంటో అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఆలయం నిర్మించిన సాయిరీ పద్మ మహేందర్ దంపతులను అభినందించారు. అంతకుముందు నరేందర్ రెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నరేందర్ రెడ్డి వెంట పలువురు ఉన్నారు.