calender_icon.png 26 November, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ట్ షాపులను మూసివేసే అభ్యర్థులనే గెలిపించాలి

26-11-2025 07:00:25 PM

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలి..

తెలంగాణ మలిదశ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్..

చిట్యాల (విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు కోసం అత్యంత కీలకమైన అంశం బెల్ట్ షాపుల మూసివేతకు ముందుకు వచ్చి ప్రమాణం చేసే సర్పంచ్ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్  పిలుపునిచ్చారు. బుధవారం చిట్యాల పట్టణంలో నిర్వహించిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ దుకాణాల వల్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయని, యువత చెడు మార్గాల బారిన పడుతున్నారని, సమాజంలో అనేక అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.

ఈ పరిస్థితిని పూర్తిగా అరికట్టాలి అనేవారే నిజమైన ప్రజాప్రతినిధులని అందుకే బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చే అభ్యర్థులకు మాత్రమే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో తన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం కోసం బెల్ట్ షాపులను ముసివేయించిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం శాంతి, భద్రత, అభివృద్ధి కోరుకుంటోందని, ఈ లక్ష్యాలను సాధించడానికి బెల్ట్ షాపుల నిర్మూలన మొదటి అడుగు అని, సమాజం కోసం పని చేయాలనే నిబద్ధత ఉన్న, గ్రామాన్ని మద్యం సమస్యల నుంచి విముక్తి చేయాలనుకునే అభ్యర్థులను ప్రజలు ముందుకు తీసుకురావాలని కోరారు. గ్రామ అభివృద్ధికి, యువత భవిష్యత్తుకి, కుటుంబాల రక్షణకి  బెల్ట్ షాపులను మూసివేస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థులకే ఓటు వేయలని అని సంజయ్ దాస్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.