26-11-2025 06:47:37 PM
తానూర్ (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల సాయం అందించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో గల గాడికర్ ఆర్త సురేష్ ఇంటిని పరిశీలించారు. ఇతని యొక్క సొంత ఇల్లు కల ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతున్నందున సంతోషంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పి గోవిందరావు, జి ఆడోళ్ళు, ఎల్ జుబేదాబాయి, కే సుశీల బాయ్, నాయకులు సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.