26-11-2025 06:45:54 PM
మోతే: సిఐటియు జిల్లా కమిటీ సభ్యులుగా మంగళ దోస పాటి శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లు డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల నుండి సిఐటియులో మండల కార్యదర్శిగా క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు మండలంలోని కార్మిక సంఘం బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేయడం జరుగుతుందని హమాలీ కార్మికులకు అండగా పెయింటింగ్ వర్కర్స్ లను ఐక్యం చేస్తూ కూలీ రెట్ల విషయంలో మధ్యాహ్నం భోజన ఏజెన్సీ ల సమస్యలు భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం అలుపు ఎరుగని పోరాటం చేస్తూ మండలంలో సుమారు 350మంది కార్మికులను కూడగట్టి ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. నాపై నమ్మకంతో నాకు అప్పగించిన ప్రతి కార్యక్రమం శక్తి వంచన లేకుండా పనిచేసి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పని చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా నా యకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.