26-11-2025 06:58:21 PM
కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి..
ఏఐపిటిఎఫ్ జాతీయ కార్యదర్శి వైఎస్ శర్మ..
కరీంనగర్ (విజయక్రాంతి): దేశంలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలకు టెట్ రూపంలో భారీ ప్రమాదం వచ్చి పడిందని.. కేంద్రం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐపిటిఎఫ్ జాతీయ కార్యదర్శి వైఎస్ శర్మ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు లక్షల సంఖ్యలో టీచర్లకు వేదనను, అయోమయాన్ని సృష్టించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకొని, ఎన్ సి టి ఈ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సత్వరమే పార్లమెంటులో విద్య హక్కు చట్టానికి, కొన్ని సెక్షన్లకు సవరణ చేయాలని, సర్వీసులో ఉన్న, అనుభవజ్ఞులైన దేశంలోని లక్షలాది ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుండి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.