26-11-2025 06:42:20 PM
మోతె: మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పుల పుష్పమ్మ ఏజెన్సీ బిల్లులు ఇప్పించండి సారు అంటు తన గోడును విలేకరులతో వాపోతు తెలిపింది. సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థిని విద్యార్థులకు భోజనం చేస్తూన్నామని ఆరు నెలలు గడుస్తున్నప్పటికి ఒక్క బిల్లు సైతం ఇవ్వలేదని పెట్టిన పెట్టుబడి ఇవ్వలేదని అప్పులు చేసి ఏజెన్సీలు నిర్వహించడంతో ఏకంంగా 6నెలలు గడిసిందని మా భాద ఎవ్వరికి చెప్పాలో అర్ధం కావడం లేదని తెలిపారు. ఒక్కొక్క గుడ్డు ఏడు రూపాయలు పడుతుందని మాకు ప్రభుత్వం ఇచ్చే రేటు కేవలం ఐదు రూపాయలేనని రెండు రూపాయలు నష్టపోతున్నామని గుడ్లకు రేటు పెంచినప్పటికి పెంచిన రేటు డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించి ఆగిపోయిన బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.