calender_icon.png 26 November, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి దిక్సూచి చూపిన రాజ్యాంగం

26-11-2025 06:43:43 PM

ఘనంగా వేడుకలు

కాటారం (విజయక్రాంతి): దేశానికి దిక్సూచి చూపిన రాజ్యాంగం ఆమోదించిన మహత్తరమైన రోజు అని అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ నవంబర్ 26 న భారత రాజ్యాంగ దినోత్సవం గా నిర్వహించుకుంటున్నామని అన్నారు. కోట్లాది ప్రజల గౌరవం, హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే మూల సూత్రాలకు పునాదివేసిన మహత్తరమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల గౌరవ అధ్యక్షులు లింగమల్ల సడవలి, మండల అధ్యక్షులు రామగిరి రాజు, ముఖ్య సలహాదారు గంధం రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి లింగమల్ల శంకర్, భూతం మధుకర్, ఫంగ సురేష్, రేవెల్లి లక్ష్మణ్, వేల్పుల రావణ్, రామిల్ల సురేష్, పోడెం దామోదర్, తాళ్లపల్లి లక్ష్మణ్, ఫంగ సురేందర్, పుట్టల పోచయ్య, రమేష్, ఉదయ్, వెంకటేశులు పాల్గొన్నారు.