హాఫీజుద్దీన్‌కు సన్మానం
03-04-2026 01:33 AM
కూసుమంచి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ హఫీజుద్దీన్ ను అఖిలభారత యాదవ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం వారి ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
సంఘం గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, జిల్లా నాయకులు పల్లెబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. మల్లిబాబు మాట్లాడుతూ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం అంటూ కొనియాడారు.




