30-07-2025 12:00:00 AM
ఆలేరు, జూలై 29 (విజయ క్రాంతి): ఆలేరు పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం లో భాగంగా ఆలేరు బాలుర ఉన్నత పాఠశాల ఉత్తమ పాఠశాలగా (జిల్లా మొత్తంలో ఒకే పాఠశాల) ఎంపికైన సందర్భంగా అభినందన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ( జిల్లా మొత్తంలో ఒకే పాఠశాల) ఎంపికైన సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపి సన్మానించారు.