calender_icon.png 27 October, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్‌బ్యాంకులో మూడుముక్కలాట!

27-10-2025 01:07:47 AM

- ఒకే పార్టీ నేతల మూడు ప్యానళ్లు

- పార్టీ ప్యానల్ లేదన్న కవ్వంపల్లి

కరీంనగర్, అక్టోబరు 26 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాం కు ఎన్నికల్లో మూడు ప్యానల్ అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మూడు ముక్కలాటలో ఏ ప్యానల్ విజే త సాధిస్తుందో చూడాలి. మూడు ప్యానళ్ల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నవారే కావడంతో, ఒక ప్యానల్ కు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచా ల రాజేందర్రావు మద్దతిస్తుండడంతో కాంగ్రె స్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు 12 డైరెక్టర్ స్థానాలకు 56 మంది పోటీ పడుతున్నారు. 43 మంది 9 జనరల్ స్థానాలకు, ఐదుగురు రెండు మహిళా స్థానాలకు, ఒక ఎస్సీ, ఎస్టీ స్థానానికి 8 మంది పోటీ పడుతున్నారు. మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ప్రచారం ప్రా రంభించారు. మరో మాజీ చైర్మన్ గడ్డం వి లాస్ రెడ్డి ప్యానల్ ఏర్పాటు చేసుకుని ప్ర చారం ప్రారంభించారు.

వీళ్ల ప్యానల్ లో వీ ళ్లు చైర్మన్ అభ్యర్థులుగా కాగా, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ నాయకులతో ఏర్పాటు చేసిన ప్యానల్ లో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల తర్వాత మెజార్టీ స భ్యుల అభిప్రాయం మేరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించేందుకు నిర్ణయించారు. కర్ర రాజశేఖర్ ప్యానల్లో డైరెక్టర్లుగా ఎ శ్రీనివాస్ రెడ్డి, తాటికొండ భాస్కర్, టి వీరారెడ్డి, దేశ వేదం, బండ ప్రశాంత్ దీపక్, ఎండిషసియుద్దీన్, సాయికృష్ణ, సరిల్ల రతన్ రాజు, ముద్దసాని శ్వేత, వరాల జ్యోతిలు ఉన్నారు.

వెలిచాల రా జేందర్రావు నిర్మల భరోసా పేరుతో ప్యానల్ ను రూపొందించారు.,ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, ఇ లక్ష్మణ్ రా జు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దా మెర శ్రీలత రెడ్డి,లున్నారు. గడ్డం విలా స్ రెడ్డి ప్యానల్ లో అక్కినపల్లి కాశీనాథం, ఎలగందుల మునీందర్, చింతల కిషన్, నా గుల సతీష్, రవీందర్, ఖలీల్డన్, లక్కిరెడ్డి కిర ణ్ కుమార్, లింగంపల్లి శ్రీనివాస్, కంజర్ల రే ణుకలు ఉన్నారు.

కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు పార్టీలకతీతంగా వివిధ పార్టీల్లో ఉన్నవారు ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ క్యాడర్ మూ డు వర్గాలువర్గాలు విడిపోయి తమతమ వారికి మద్దతుగా ప్రచారంనిర్వహిస్తున్నారు.

- అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ ప్రకటించలేదు...

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎ న్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎలాంటి ప్యా నెల్ ను ప్రకటించలేదు. అసత్య ప్రకటనలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయ కులు, కార్యకర్తలు, ఆర్బన్ బ్యాంకు ఓటర్లు నమ్మవద్దు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బరిలో నిలిచిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వారే ఉ న్నందున కచ్చితంగా కాం గ్రెస్ పార్టీకి చెందిన సభ్యులే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు న్నాయి. అర్బన్ బ్యాంకు చరిత్రలో ఎక్కువ కాలం పాలకవర్గాన్ని నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈసారి కూ డా అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో విజయం సా ధించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బ్యాంకు అ భివృద్ధికి, నూతన పాలకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు అందిస్తుంది. కార్పొరేట్ స్థా యిలో బ్యాంకు ఆధునీకరించడం, సేవలందించడానికి ప్రభుత్వంకృషిచేస్తుంది.

మానకొండూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ