హాస్టల్ వార్డెన్, ఏఎన్‌ఎంలపై వేటు
బాలిక గర్భం దాల్చిన ఘటనలో ఐటీడీఏ పీవో చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గత నెల 28వ తేదీన మైనర్ బాలిక గర్భస్రావం జరిగిన ఘటనలో ఎస్‌ఎంఎస్ హాస్టల్ వార్డెన్ లక్ష్మి, ఏఎన్‌ఎం సంధ్యలను బుధవారం ఐటీడీఏ పీవో రాహుల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ఎస్‌ఎంహెచ్ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక పరీక్ష సమయంలో గర్భస్రావం ఆయన ఘటన విధితమే.
ఈ సంఘటనపై కలెక్టర్ అంకిత్ సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐటీడీఏ పీవోకు సిఫారసు చేశారు. స్పందించిన ఐటీడీఏ పీవో ఎస్‌ఎంఎస్ హాస్టల్ వార్డెన్ లక్ష్మి, ఏఎన్‌ఎం సంధ్యలను సస్పెండ్ చేశారు. సంఘటన పై పోలీస్ శాఖ నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది.




