05-12-2025 02:13:42 AM
బోయినపల్లి: డిసెంబర్4( విజయక్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరద వెళ్లి లోని శ్రీదత్తాత్రేయ ఆలయంలో 45వ దత్త జయంతి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా జరిగాయి.పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు బారి సంఖ్యలో తరలి రాగా బోటు లో వెళ్ళి దర్శనం చేసుకునే వరకు దాదాపు రెండు గంటల నుండి మూడు గంటల సమయం పట్టింది.
రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎస్త్స్ర రమాకాంత్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూశారు. వేములవాడ రూరల్ సీఐ ఎస్‌ఐ రమాకాంత్ ను దగ్గర ఉండి పరిస్థితి ఎప్పటికప్పుడు సమక్షించి ఇలాంటి ఇబ్బందులు కలవకుండా బోటులో వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో 5 బోట్లను ఏర్పాటు చేయగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
భక్తులు బోట్లో ప్రయాణిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణం లో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ ఇన్చార్జ్ డి.ఎస్.పి నాగేంద్ర చారి దత్తాత్రేయను దర్శించుకున్నారు. గుట్ట కింద సత్య దత్త వ్రతాలు నిర్వహించగా అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని సత్య దత్త వ్రతాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ దత్తాత్రేయ ఆలయ ప్రాంతం గుట్ట కింద ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ టూరిజం శాఖ ఐదు బోటు లు ఏర్పాటు చేయడంతో దర్శన భాగ్యం కలిగినట్లు తెలిపారు.