calender_icon.png 22 October, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

22-10-2025 12:12:32 AM

 ఆమనగల్లు, అక్టోబర్ 21: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో అలసత్వం ప్రదర్శించకుండా నిర్ణీత గడువులో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఎంపీడీవో కుసుమ మాధురి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని ఆకుతోటపల్లి, సీతారాంనగర్ తండాలో ఇందిరమ్మ ఇల్లు పోస్ట్ ఫ్యాక్టో వెరిఫికేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆయా పంచాయతీలో  కార్యదర్శులు, సర్వేయర్లు  ఇందిరమ్మ ఇల్లు ఫోటో కాప్చరింగ్ లో సరిగ్గా చేస్తున్నారో లేదో అని ఆమె పరిశీలించారు.

లబ్ధిదారులకు విడుదలవారీగా  ఇందిరమ్మ ఇళ్ల  కు బిల్లును సకాలంలో మంజూరు అవుతాయని   బిల్లుల మంజూరు విషయంలో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా   పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శు లను ఆమె ఆదేశించారు.   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి ప్రభుత్వ సంస్థకి మరియు ఇంట్లోకి  ఇంకుడు గుంతలు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్వెల్  రీఛార్జ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్స్ ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లను సూచించారు. పనులకు సంబంధించి ఎస్టిమేషన్స్ వేసి పనులు స్టార్ట్ చేయాల్సిందిగా, నర్సరీలు,పల్లె ప్రకృతి వనాలు కూడా కాపాడుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్స్ జైపాల్, ఈదమయ్య పాల్గొన్నారు.