22-10-2025 08:03:31 AM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ పట్టణ కేంద్రంలోని పాత శివాలయం, వలిగొండ గుట్ట మధ్యగల ఇండ్ల పరిసరాల్లోకి మంగళవారం రాత్రి దాదాపు 8 అడుగుల భారీ కొండచిలువను(Python) గ్రామస్తులు కొట్టి చంపి వేశారు. వివరాల్లోకి వెళ్లితే మైసోల్ల రాములు ఇంటి వెనుకగల కోళ్ల గూటిలోని కోళ్లు రాత్రి అరుస్తుండడంతో వెళ్లి చూడగా భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రాములు చుట్టుపక్కల వారి సహాయంతో కర్రలతో కొండచిలువను కొట్టి చంపి వేశారు. రాములు ఇంటితో పాటు చుట్టుపక్క ఇళ్లలో చిన్న పిల్లలు ఉండడంతో కొండచిలువ నుండి భారీ ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు.