22-10-2025 08:00:03 AM
హైదరాబాద్: నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు (Karthika Mahotsavam Celebrations) జరగనున్నాయి. బుధవారం నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాస వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ(Srisailam Temple EO) ప్రకటించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మల్లన్న భక్తులకు దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి ఏర్పాట్లు, పార్కింగ్, పాతాళగంగ స్నాన ఘట్టాలు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో వెల్లడించారు. కార్తీక మాసంలో రూ. 5 వేల గర్భాలయ, రూ. 1500 సమూహిక అభిషేకం రద్దు చేయబడింది. రోజూ విడతలవారీగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం, ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మీడియా ప్రకటనలో తెలిపారు.