calender_icon.png 22 October, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివపురిలో ‘కబ్జా’.. పనులు నిలిపివేత

22-10-2025 12:14:33 AM

కబ్జాదారులకు ఎమ్మార్వో కఠిన హెచ్చరిక

మణికొండ, అక్టోబర్ 21, విజయక్రాంతి : శివపురి కాలనీలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. 60 గజాల ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు నిర్మాణం చేపట్టారు. గతంలో ఎమ్మార్వో, కమిషనర్ పరిశీలించి ప్రభుత్వ స్థలంగా గుర్తించిన ప్రదేశంలోనే ఈ నిర్మాణం ప్రారంభించడం గమనారం.విషయం ఎమ్మార్వో దృష్టికి వెళ్లడంతో, ఆయన తక్షణమే పనులను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.గతంలో శివపురి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డులను కొందరు తొలగించారని, మళ్లీ ఎవరైనా బోర్డులను తొలగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.