22-10-2025 01:54:46 AM
నవంబర్ 3 నుంచి కాలేజీలు మూసేస్తామని ప్రైవేట్ కళాశాలల అల్టిమేటం
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తి విద్యాకోర్సులు అందిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్ట నున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వి డుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల 1లోపు బకాయిలు విడుదల చేయకుంటే 3వ తేదీ నుంచి కళాశాలలను మూసేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసో సియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి -ప్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య) తేల్చిచెప్పింది.
బుధవా రం ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు లు ఇస్తామని, దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సీఎస్ రామకృష్ణారావును కలిసి వాటిని అందజేస్తామని స్పష్టం చేసింది. ఈనెల 24న రాష్ట్రంలోని కళాశాలల యాజమాన్యాలు, 25న విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించింది.
అలాగే 26న జనరల్ బాడీ సమావేశం నిర్వహించి బకాయిల అం శంపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొం ది. 1వ తేదీలోపు బకాయిలు విడుదల చేయకుంటే పలు ప్రజాసంఘాలు, రాజకీయ శ్రేణులతో భేటీ అయి, వాటి మద్దతు కోరతామని పేర్కొంది. 3వ తేదీ నుంచి కళా శాలలను మూసివేస్తామని తెలిపింది.
మొత్తం కావాలని..
యాజమాన్యాలకు మొత్తంగా రూ.10 వేల కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావాల్సి ఉండగా, 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రూ. 2500 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. కళాశాల యాజమాన్యాల ఒత్తిడి మేరకు రాష్ట్రప్రభుత్వం ఇటీవల మొత్తం బకాయిల్లో రూ.1,200 కోట్లకు టోకెన్లు జారీ చేసింది. ఆ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యాలు గత నెల 15 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ప్రకటించాయి.
యాజమాన్యాల సంఘం ఈ మే రకు రాష్ట్రప్రభుత్వంతో జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. దీంతో రెండు రోజుల పా టు కాలేజీలు బంద్ అయ్యాయి. సర్కార్ తిరి గి స్పందిస్తూ.. ముందు రూ.600 కోట్ల బకాయిలు చెల్లిస్తామని, మిగిలిన మరో రూ. 600 కోట్లను దీపావళిలోపు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీపావళి దాటిన ప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు రూ.376 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి. ఇచ్చిన హామీ ప్రకారం నవంబర్ 1లోపు మిగిలిన రూ.824 కోట్ల విడుదల చేయాలనే డిమాండ్‌తో ముందుకు వెళ్తున్నాయి. బకాయిలు విడుదల చేయకుండా నవంబర్ 3 నుంచి కాలేజీలు మూసేస్తామని ఖరాఖండీగా చెప్తున్నాయి.