calender_icon.png 26 August, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

14-03-2025 12:27:17 AM

కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేసిన బీజేపీ నాయకులు

పెబ్బేరు, మార్చి 13: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణి చేయాలని పెబ్బేరు పట్టణ బీజేపీ అధ్యక్షులు క్రాంతి కుమార్ నాయుడు డిమాండ్ చేశారు. గురువారం రోడ్డు విస్తరణ బాధితుల సమస్యలు, పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ అశోక్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా ఎలాంటి అవకతవకలు తేలేత్తకుండా అందరికీ సమన్యాయంగా పనులు చేపట్టాలని కోరారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి సత్వరమే ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు.

ఎండాకాలంలో మంచినీటి సమస్యల తేలేత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో పలు వార్డులో చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వార్డులో చెత్త సేకరణ వాహనాలు సకాలంలో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గౌని హేమా రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు రంగస్వామి గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షులు రామకృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షులు కంచ ఆంజనేయులు, బలరాం, మోతే రఘు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.