14-03-2025 12:23:51 AM
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్‌కుమార్
ముషీరాబాద్, మార్చి 13: (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ కవేలి గ్రౌండ్స్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నీ.వి.చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల పేరుతో వున్న బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ మాట్లా డుతూ తమ నీ.వి.చారిటబుల్ స్వచ్చంధ సంస్థ ద్వారా డివిజన్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు, స్కూల్ నేమ్ బోర్డు ఏర్పాటు చేశామని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ దేవదాస్, పాఠశాల ఉపాధ్యాయులు సౌజన్య,మెరిబా, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, ఆకుల సురేందర్, ఆనంద్ రావు, సాయి కుమార్, స్థానికుడు సాయిలు తదితరులు పాల్గొన్నారు.