10-10-2025 01:14:05 AM
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్కర్నూల్ అక్టోబర్ 9 (విజయక్రాంతి) రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, గత 22 నెలలుగా ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. గురువారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని కార్యాలయంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ప్రజలకు ప్రభుత్వం వైఫల్యాలను అవగాహన చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డులు పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేసి, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తారనిపేర్కొన్నారు.