10-10-2025 01:12:25 AM
వెల్దండ అక్టోబర్ 9:జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం వెల్దండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ కార్తీక్ కుమార్ ను ఆదేశించారు. తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది హాజరు తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు.మండల పరిధిలో 16 రెవెన్యూ సదస్సులో వచ్చిన 363 దరఖాస్తులపై వివరాల అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు వచ్చిన ప్రతి దరఖాస్తుకు నోటీసులు అందజేయడం జరిగిందని 110 దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిపారు. 253 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ కు తహసిల్దార్ వివరించారు.కలెక్టర్ వెంట మండల డిప్యూటీ తాహసిల్దార్ కిరణ్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది నసీరుద్దీన్ తదితరులుఉన్నారు.