calender_icon.png 4 June, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మరింత చేరువలో గృహనిర్మాణ శాఖ

03-06-2025 12:49:07 AM

ప్రారంభించిన కలెక్టర్ రాహుల్‌రాజ్

మెదక్, జూన్ 2(విజయక్రాంతి): ప్రజలకు మరింత చేరువలో గృహ నిర్మాణ శాఖ కార్యాలయం రూపుదిద్దుకుంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న హౌసింగ్ కార్యాలయాన్ని కలెక్టరేట్ కార్యాలయ రెండవ అంతస్తులో నూతనంగా కేటాయించిన  కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యాలయాన్ని పరిశీలిస్తూ హౌసింగ్ డిపార్ట్మెంట్ విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు, కార్యాలయంలో మౌలిక వసతులు తదితర వివరాలను హౌసింగ్ పీడీ మాణిక్యం అడిగి తెలుసుకున్నారు.

కార్యాలయాన్ని సీసీ కెమెరాల ద్వారా సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ సమయపాలనతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని, ఇందిరమ్మ ఇండ్ల సమస్యలపై ప్రజలకు ఉత్తమ సేవలందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు అందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ భుజంగరావు,హౌసింగ్ పీడీ మాణిక్యం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, కార్యాలయ సిబ్బందిపాల్గొన్నారు.