ఇంకెన్నేళ్లు..?
- ప్రాజెక్టు నిర్మించి 45 ఏళు... ఈనాటికి పూర్తిగా నీరందని వైనం
లీకులు అవుతున్న ప్రాజెక్టు కాలువలకు అమర్చిన పైపులైన్లు, అలుగులు
స్తంభించి పోయిన తూముల గేట్లు పూడుకొని పోయిన కాలువలు
ఆశ్వారావుపేట, డిసెంబర్ 4, (విజయక్రాంతి ) : అశ్వారావుపేట మండలం, తిరు మలకుంట వద్ద 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో ‘ఓ టు చెరువు‘ నిర్మించారు. ఇప్పటికి ఈ చెరు వు నిర్మించి 45 సం లు అయ్యింది. సుమా రు 600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు ఈ ప్రాజెక్టుకు అప్పట్లో రూప కల్పన చేసారు. విశేషమేమంటే ఈ ప్రాజెక్టు నిర్మించి నాలుగు దశాబ్దాలు గడిచిన ఇప్పటికి ప్రాజెక్టు క్రింద పూర్తి సాయి ఆయుక ట్టుకు ఇప్పటి వరకు ఒక్క ఏడాది కూడ నీ టిని అందించలేక పోయింది.
ఇప్పటి వరకు పూర్థిస్థాయి సామర్థ్యం కల్పించడంలో పురి టి నొప్పులు వడుతూనే ఉంది. ప్రస్తుతం కొ ద్ది పాటి ఆయుకట్టుకు, ప్రాజెక్టు క్రింద బా గంలో ఉన్న చెక్ డామ్ ద్వార ముత్యాల చెరు వు నింపడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్కు ఉపయోగ పడుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగ ఉన్న సమయంలో అనేక మార్లు నిధులుమంజూరి చేసినప్పటికి అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణలోపంతో నిధులు వెచ్చించిన మేరకు ప్రాజెక్టును పఠిష్టత చేయలేకపోయారు. 2006లో భారీ వర్షాలకు కట్టకు భారీ గండి పడింది ఆ తరువాత ప్రాజెక్టుగండి పూడ్చడానికి నిదులు మంజూరి అయ్యాయి. ఆ తరువాత తూము లు మరమ్మత్తులకు, కాల్వల పటిష్టతకు నిదులు మంజూరి అయ్యాయి. ఇదంతా జరి గి నాలుగైదేళ్ళు జరిగింది. ఆ తరువాత ప్రా జెక్టు మరమ్మత్తుకు నిదులు మంజూరి కాలేదు.
-స్తంభించిన తూము గేట్లు.. పైనులైన్లు, అలుగువద్ద తీకులు...
ఈ చిన్న తరవా ప్రాజెక్టుకు కుడి ఎడమ తూములు ఏర్పాటు చేయడం ద్వార తిరుమలకుంట, పాకలగూడెం, తిరుమలకుంబ కాలనీ, ఉశిర్లగూడెం,- మర్రిగూడెంలకు సాగునీటిని అందించేల డిజైన్ చేసారు. గత - రెండు. మూడేళ్ళుగా రెండు తూములకు అమర్చిన గేట్లు పనిచేయకపోవడంతో రైతులే ఇనుక బస్తాలు వేసుకొని లీకులను ఆవుకొని వేసవి కాలంలో అవసరమైన నీటిని వినియోగించుకుంటున్నారు.
అలుగులు, కాలువల్లోకి నీరు చేరే విదంగా ప్రాజెక్టు కాలువల మద్యలో అమర్చిన పైపులు పగిలిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు పడటంతో ప్రాజెక్టులో నుండి వచ్చిన నీరు కాలువల్లోకి చేరకముందే లీకులై నీరంతా వృధాగా బైటకు పోతుంది. మూడేళ్లు- క్రితం మంజూరైన నిధులతో తూములు గేట్లు కొత్తగ అమర్చారు. ఎడమ కాలువ వశిష్టతకోసం నీధులు వెచ్చించనున్నట్లు అధికారు లు వెల్లడించారు.
ఈ పనులను అప్పట్లో వర్షాకాలం ముందు ప్రారంబించారు. వర్షాలు- వచ్చే సమయానికి సగం వనులే అయ్యాయి. మిగతావి వర్షాకాలం అనంతరం పూర్తి చేస్తామని అదికారులు వెల్లడించారు. కాని ఆ తరువాత చేసిన పనులు అంతంత మాత్రంగానే జరిగాయని చెప్పు వచ్చు. అంతేకాక చేసిన పనులు ఉపయోగంలోకి రాకుండా పోయాయి.
- పూడుకు పోయిన ఎడమ కాలువ...
ప్రాజెక్టు ఎడమ కాలువ కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. గిరిజన వాడ వైపున సుమారు రెండు కిలో మీటర్ల మేర ఉన్న కాలువ దాదాపు 30 సంవత్సరాల క్రితమే పూర్తిగ పూడుకు పోయింది. ఇప్పుడు ఆ కాలువ ఆనవాళ్ళు కోల్పోయింది. కాలువ ఆక్రమణల పాలైంది. గతంతో నిధులు మంజూరి అయిన సమయంలో సర్వే చేసి పూడుకొని పోయిన కాలువను తీస్తామని అదికార లు చెప్పారు.
ఆ తరువాత కాలువ పనుల ఊసే లేకుండా పోయింది. ఎళ్ళు గడిచిన ఇప్పటి వరకు మిగిలిపోయిన పనుల ఊ సే లేదు నిధులు వినియోగం ఎంత వరకు జరిగిందో అంచనాల్లో సూచించిన వనులు ఎందుకు పూర్తికాలేదో ఆ దేవరికే తెలియాలి. వెరశి ప్రాజెక్టు నిర్మించిన నాలుగు దశాబ్దాలు గడిచిన రైతులకు ఉపయోగ పడకుండా ఇంకా పురిటి నొప్పులు పడుతుండటం నిజంగా రైతుల దౌ ర్భాగ్యమే అంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైన అధికారులు ఓ టి చెరువు పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.






