12 March, 2026 | 9:55 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

కాంగ్రెస్‌లో చేరిన శేఖర్‌బాబు

05-12-2025 12:00 AM
  1. ఎంపీ చామల సమక్షంలో చేరిక
  2. ఆ వెంటనే శాలిగౌరారం సర్పంచుగా ఏకగ్రీవం

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుజ్జులాల్ శేఖర్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆ గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఆయనను శాలిగౌరారం సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డిది స్వగ్రామం శాలిగౌరారం కావ డంతో ఈ ఏకగ్రీవ ఎంపికకు ఎన్నికల వాతావరణంలో ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

గుజ్జులాల్ శేఖర్ బాబు బుధవారం స్వయం గా ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డిని కలుసుకుని, తనను ఏకగ్రీవం చేయడంలో అందించిన సహకారం, ఆశీర్వాదం, ప్రోత్సా హం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎం పీ చామల మాట్లాడుతూ.. శాలిగౌరారం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేసే నాయ కత్వం అవసరమని, గుజ్జులాల్ శేఖర్ బాబు ఏకగ్రీవ అభ్యర్థిగా ఎంపిక కావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనం అన్నారు.