18 April, 2026 | 5:38 AM

రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

17-05-2025 11:10 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  ఇవాళ, రేపు  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని, రేపు ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతవరణ శాఖ హెచ్చిరించింది. తెలంగాణలోని గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా, విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ తెలిపింది.