calender_icon.png 5 November, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుడి ఇంట్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్

05-11-2025 01:38:25 AM

-పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3 లక్షలు

-డాక్టర్ అరెస్ట్, మరో ముగ్గురుపై కేసు నమోదు

ముషీరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి):  పది మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు  వైద్య వృత్తితో ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్ కు బానిసయ్యాడు. డ్రగ్స్ కొనాలంటే తనకు తగినంత డబ్బు లేదని ముగ్గురు స్నేహితులు చేసే డ్రగ్స్ వ్యాపారం లో పాలుపంచుకున్నాడు.ఢిల్లీ, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ ఎక్సైజ్ ఎస్టిఎఫ్ బీ టీం కు జాన్ పాల్ అనే పీజీ చదువుతున్న డాక్టర్ పట్టుబడ్డాడు. 

వైద్యుడు ఇంట్లో తనిఖీలు చేస్తున్న తరుణంలో అతని ఇంట్లో లభించిన డ్రగ్స్ ను చూసి ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఎస్ టి ఎఫ్ టీంకు  చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందినటువంటి ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులు బెంగుళూరు ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను తెప్పిస్తారు. వచ్చిన డ్రగ్స్ ను డాక్టర్ జాన్ పాల్ నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. 

  సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఎస్త్స్ర బాలరాజు,  కానిస్టేబుల్ విజయ్ కృష్ణ సిబ్బంది కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించగా భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 26.95 గ్రాముల ఓజి కుష్, 6.21 గ్రాముల ఎండిఎం ఎ,15 ఎల్ ఎస్ డి బాసట్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాసిస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఈ డ్రగ్స్ విలువ రూ. 3 లక్షలు విలువ ఉంటుందని ఎస్‌ఐ బాలరాజు తెలిపారు. డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరత్ లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.