05-11-2025 01:40:05 AM
-9వ తెలంగాణ రాష్ట్ర వైద్య సదస్సు సత్కారం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బేగంపేటలో కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్‌లో కార్డియాక్ సైన్సెస్ విభాగాధిపతిగా, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీధర్ కస్తూరికి ‘వైద్య వృత్తి సేవలో శాతవాహన గడ్డ గర్వించదగిన బిడ్డ’ అనే ప్రతిష్టాత్మకమైన బిరుదు, అవార్డు అం దుకున్నారు. సర్టిఫికెట్, ‘వైద్య వృత్తి సేవలో శాతవాహన భూమి గర్వించదగిన పుత్రుడు‘ గోల్డ్ మెడల్, చారిత్రక భూమిలో ఐఎంఏ కరీంనగర్ బ్రాంచ్ నిర్వహించిన 9వ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక తెలం గాణ రాష్ట్ర వైద్య సదస్సు 2025 సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు.
ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్స్ ఫోరమ్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ కస్తూరికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. ఈ ప్రాంతానికి చెందిన విశిష్ట వైద్యుల యొక్క అసాధారణ సేవ, నిబద్ధతను గుర్తించడానికి ఆర్గనైజింగ్ కమిటీ, డాక్టర్ పి కిషన్ (ఐఎంఏ అధ్యక్షుడు, తెలంగాణ), ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పొలాస రామ్ కిరణ్, ఆర్గనైజింగ్ ట్రెజరర్ డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ ఈ ప్రత్యేక గోల్ మెడల్ అవార్డును అందజేశారు.
“నా స్వస్థలంలో నా గౌరవనీయులైన సహోద్యోగుల మధ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర శాఖచే గుర్తింపు పొందడం గొప్ప గౌరవం” అని డాక్టర్ కస్తూరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ద్వారకానాథ్‌రెడ్డి, అధ్యక్షుడు డాక్టర్ కిషన్, కార్యదర్శి డాక్టర్ విజయ్‌కుమార్ (అధ్యక్షుడు- ఎలెక్ట్), వి.అశోక్ (ఐఎంఏ కార్యదర్శి, తెలంగాణ), డాక్టర్ ఠాకూర్ దయాల్ సింగ్ (ఐఎంఏ కోశాధికారి, తెలంగాణ), డా. కవ్వంపల్లి సత్యనారాయణ (ఎమ్మెల్యే, -మానకొండూరు), కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.