calender_icon.png 5 November, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్పు జూబ్లీ హిల్స్ నుంచే మొదలవ్వాలి

05-11-2025 01:35:51 AM

-ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విఫలం

-నివాసాల మధ్య శ్మశానమా? ఇది అమానుషం

-బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి):తెలంగాణలో అవకాశాలు పొందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. మీరు ఆ రెండు పార్టీల పాలనను చూశారు.. ఇక మార్పు రావాల్సిన సమ యం ఆసన్నమైంది. ఆ మార్పు జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కావాలి అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు.

ఎర్రగడ్డలోని కల్పతరువు రెసిడెన్సీ క్లబ్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాలమైన సామాజిక, రాజకీయ అనుభవం గల విద్యావంతుడు, సంస్కారవంతుడు తమ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి. ప్రజ లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పిలిస్తే పలికే నాయకుడు ఆయన. బాధ్యతతో పాలన చేసే ఇలాంటి వారు మనకు అవసరం, అని రాంచందర్‌రావు పేర్కొన్నా రు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక సంస్థలపై గళం విప్పారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని నివాస ప్రాంతాల మధ్య ప్రైవేట్ శ్మశాన వాటిక ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది పూర్తిగా అవివేకపూరితమైన అమానుషమైన చర్య అని, ఎన్ని కల సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజల మనోభావాలను దెబ్బతీయడ మేనని ధ్వజమెత్తారు.

ఎర్రగడ్డ సహా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అనేక కాలనీలు, బస్తీలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, వెలగని వీధి దీ పాలు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సి పల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనతపై మాట్లాడుతూ, ఈ రోజు మ నం చూస్తున్న సైబర్ సిటీ, గచ్చిబౌలి స్టేడి యం వంటి అభివృద్ధికి పునాదులు వేసింది అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగించి, ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పుకోవడం హా స్యాస్పదం, అని రాంచందర్ రావు అన్నారు. యూపీఏ హయాంలో 2జీ, 3జీ, హెలికాప్టర్ కుంభకోణాలు జరిగితే, గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో అవినీతిరహిత, పారదర్శక పాలన కొనసాగుతోందని రాంచందర్‌రావు పేర్కొన్నారు.