calender_icon.png 11 February, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా గంజాయి పట్టివేత

11-02-2026 03:34:01 AM

ముగ్గురు అరెస్ట్ 78.550 కిలోల గంజాయి స్వాధీనం

సనత్‌గర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి):- ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గం జాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు విడతలుగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 78.550 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గు రు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 7న నమ్మకమైన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి ఎస్‌ఆర్ నగర్లోని హోటల్ న్యూ శ్రీకృష్ణ రెసిడెన్సీ (రూమ్ నం. 404)లో దాడి నిర్వహించారు.

ఈ దాడిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన రినితా రైటా (29)ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 11.370 కిలోల గంజాయి మరియు ఒక జియో భారత్ కీప్యాడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు క్రైమ్ నం. 870/2025 కింద ఎన్డీపీఎస్ చట్టం 1985లోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) & 29 ప్రకారం కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

విచారణ లో ప్రధాన సాగుదారు, సరఫరాదారుల వివరాలు వెలుగులోకి రావడంతో, పరారీలో ఉన్న మానియెల్ దలాబెహెరా (ప్రధా న గంజాయి సాగుదారు), ఇస్మాయిల్ రైటా (48), గంజాయి సబ్ పెడ్లర్గా వ్యవహరిస్తున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం మరో విశ్వసనీయ సమాచారం మేరకు బల్కంపేటలోని 33/11 కేవీ బేగంపేట సబ్ స్టేషన్ వద్ద దాడి నిర్వహించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి 67.18 కిలోల గంజాయి మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు గంజాయి రవాణా చేసి నగరంలో విక్రయించేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు విచారణ కొనసాగుతోంది.