28-09-2025 09:50:39 PM
భక్తులకు అన్నదానం నిర్వహించిన బండారి సంతోష గంగాధర్ !!
ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి.!!!
శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని పిల్లుట్ల గ్రామంలో దేవినవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు దుర్గాదేవిగా అవతారం చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రముఖ సంఘ సేవకులు బండారి సంతోష గంగాధర్ భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి హాజరయ్యారు. అనంతరం దుర్గ భవాని అమ్మవారిని దర్శనం చేసుకుని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి కిష్టయ్య . బండారి ముత్యాలు. బండారి నగేష్. గాండ్ల కిష్టయ్య. బండారి సాయి కిరణ్. బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు. పిల్లి నరేష్. ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శివకుమార్. బోను లింగం భవాని ఉత్సవ కమిటీ సభ్యులు. కమ్మరి నరేందర్. బొంది శ్రీనివాస్ గౌడ్. భవాని ఉత్సవ కమిటీ చైర్మన్ గురాల ఆంజనేయులు. మాజీ సర్పంచ్ పెదపులి రవి. పిల్లి మణికంఠ. భవాని ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రముఖ సంఘ సేవకులు బండారి సంతోష గంగాధర్ ను ఘనంగా సన్మానం చేశారు . అనంతరం అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం పైన మీపైన ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లుట్ల గ్రామ దుర్గామాత భక్తులు తదితరులు పాల్గొన్నారు.