30-07-2025 12:11:59 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు టెండర్లలో భారీ స్కాం చోటుచేసుకుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తొంభై రోజుల్లో 35 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్మేందుకు టెండ ర్లు పిలిచారని, ఈ టెండర్లలో మొదటి నుంచి ఇప్పటివరకు అవకతవకలు జరిగాయన్నారు. ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బులు ప్రైవేటు ఖాతాల్లోకి వెళ్లాయని, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చే యలేదన్నారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కమలాకర్ మా ట్లాడుతూ దర్యాప్తు సంస్థల మీద తమకు నమ్మకం ఉందని, ఏసీబీ ఈ కుంభకోణం మీద ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ కుంభకోణంపై రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల న్నింటికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లు ఇప్పటికైనా నోరు తెరవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు టెండర్ల కుంభకోణంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, సివిల్ సప్లు అధికారు ల పాత్ర ఉందని, ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్ర భుత్వం నుంచి స్పందన లేదనిమాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం టన్నుకు రూ.2,230 ఎక్కువగా బిడ్డర్ల నుంచి రైస్‌మిల్లర్ల నుంచి వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని ఆరోపించారు.
అక్రమంగా డ బ్బులు చేరిన ఖాతాల వివరాలు సేకరించామ ని, ఇందులో మనీలాండరింగ్ జరిగిందన్నా రు. తాము సేకరించిన ఆధారాలతో ఈడీకి ఫి ర్యాదు చేశామని, సీబీఐకి కూడా ఫిర్యాదు చే స్తున్నామన్నారు. మొత్తం 700 పేజీల బుక్‌లె ట్ తయారు చేసి దర్యాప్తు సంస్థలకు పంపుతున్నట్లు తెలిపారు. రూ.423 కోట్లు వివిధ అకౌం ట్లలోకి బదిలీ అయ్యాయని ఆరోపించారు.