30-07-2025 12:14:31 AM
మహదేవపూర్ (భూపాలపల్లి) జూలై 29 (విజయక్రాంతి): తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించి, అదే బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన ఘటన భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్సై పవన్ కుమార్ తెలి పిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లికి చెందిన సింగనేని మల్లేష్‌ెే-భాగ్య దంపతుల కుమారుడు అరవింద్ సూరారం గ్రామంలోని శివచంద్ర విద్యా మందిర్‌లో చదువుతున్నాడు.
మంగళవా రం ఉదయం అరవింద్‌ను బస్సు ఎక్కించడానికి తల్లి భాగ్య రాగ తల్లి వెంబడి కూతు రు తేజస్విని(3) వచ్చింది. అన్నను స్కూల్ వ్యాన్ ఎక్కించి బాయ్ చెప్పుకుంటూ స్కూల్ వ్యాన్ పక్కకు వెళ్లింది. గమనించని డ్రైవర్ బస్సును పోనివ్వడంతో వెనుక చక్రాల కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకు కేరింతలతో తమ వెంట ఉన్న చిన్నారి పాప కళ్లెదుటే రక్తపు మడుగులో విగత జీవిగా మార డంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
వ్యాన్ డ్రైవర్ పరారు కావడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచా రం అందించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తండ్రి మల్లేష్ ఫిర్యాదుతో వ్యాన్ డ్రైవర్ వలి మహ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.