30-07-2025 12:11:13 AM
- వైభవంగా ముగిసిన జిల్లా మహాసభలు
- సభల్లో పలు తీర్మాణాలు ఆమోదం
- ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి
- స్థానిక ఎన్నికల్లో ఐఖ్యంగా ముందుకు సాగుదాం
- బలమైన కేంద్రాల్లో సత్తాచాటుదాం
- సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
భద్రాద్రికొత్తగూడెం, జులై 29 (విజయక్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కారమే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన ఎ జెండా అని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎందాకైనా, ఎవ్వరితోనైనా పోరాటం చేసేందుకు సిద్ధం అని ఆ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా తెలిపారు. మంగళవారం శేషగిరి భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంగా ఈనెల 26,27 తేదీల్లో సిపిఐ జిల్లా 3వ మహాసభ లు అత్యంత ఘనంగా జరిగాయని, ఆ మహాసభల్లో 30 మందితో జిల్లా కార్యవర్గాన్ని, 79 మందితో కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్న ట్లు చెప్పారు.
మహాసభల కంటే ముందే 22 రెవెన్యూ మండలాలు, 3 మున్సిపాలిటీలు, 1 నగరపాలక సంస్థ పరిధిలో 713 గ్రామశాఖల మహాసభలు జరిపామని, జిల్లా వ్యా ప్తంగా సిపిఐలో 13,474 మంది శాశ్వత ప్రా థమిక సభ్యత్వం కలిగిన వారు ఉన్నట్లు జా తీయ నాయకత్వ సూచనల మేరకు కమిటీలో 10 శాతం యువతకు, మరో 10 శా తం మహిలకు ప్రధాన్యత కల్పించామన్నా రు. మహాసభ వేధికగా 49 తీర్మాణాలు ఆ మోదం పొందాయన్నారు.
ఇందులో ప్రథానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలు జిల్లాలోని ప్రతీ ఎకరాకు అందించాలని, కొత్తగూడెం, ఇల్లెందుల్లో ఓపెన్ కాస్టు బొగ్గు గనులను తక్షణమే ప్రారంభించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో కళాక్షేత్రాలు నిర్మించాలని, నూతన విద్యావిధా నాన్ని ఉపసంహరించు కోవాలని, ఆంధ్రా లో కలిసిన ఐదు పంచాయితీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో కలపాలని, పేదల సాగులో ఉన్న మిగులు పోడు భూములకు పట్టాలివ్వాలని, స్వామినాధన్ కమీషన్ మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మహిళలకు విద్యా, వైద్య రం గాల్లో ప్రత్యేకఅవకాశాలు కల్పించాలని, మ హిళ రక్షణ చట్టాలు, సంక్షేమ చట్టాలు అమ లు చేయాలని, అశ్వారావుపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్, ఆర్టిసి డిపో, హర్టీకల్చర్ యూనివర్సిటి, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పా టు చేయాలని, పాల్వంచ కేంద్రంగా ఎరువుల కర్మాగారం, కేటిపిఎస్ లో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, భద్రాచలం గోదావరి కరకట్ట నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసి, వరద ముంపు నుం డి గ్రామీణ ప్రాంతాలకు రక్షణ కల్పించాలనే తిర్మాణాలతో పాటు పలు తీర్మాణాలు ఆ మోదం పొందాయన్నారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం నూతన నాయకత్వం ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలుపుకోవాలని, హామీల అమలు కాకుంటే ప్రశ్నిం చేందుకు, వాటి సాధనకు వెనుకడుగు వేసేది లేదన్నారు. జిల్లాలో సిపిఐ బలమైన నిర్మాణాన్ని కలిగి ఉందన్నారు. సిపిఐ వం దేళ్ల ఉత్సవాల్లో భాగంగా ఎర్రజెండా రెపరెపలాడాలని, క్రింది స్థాయి నుండి పార్టీ సంస్థగత నిర్మాణం మరింత బలంగా మారాలాన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, అసెంబ్లీ ఎన్నికల ఒప్పందంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఐఖ్యంగా పనిచేద్దామని, బలమైన స్థానాల్లో గతంలో మాదిరిగానే మన సత్తా చాటుదామని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ము త్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, ఎస్టి సలీం, మున్నా లక్ష్మీ కుమారి, సరెడ్డి పు ల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, భూక్య దస్రు, వీసంశెట్టి పూర్ణ చంద్రరావు, వాసిరెడ్డి మురళీ, కంచర్ల జమలయ్య, అడుసుమిల్లి సాయిబాబు, ఉ ప్పుశెట్టి రాహూల్, ఎస్ కే ఫహీమ్, అడ్డగర్ల తాతాజీతోపాటు కౌన్సిల్ సభ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.