రాఘవయ్యకు నివాళి
హైదరాబాద్ సిటీబ్యూ, డిసెంబర్ 8 (విజయక్రాంతి): శ్రీసిటీ చైర్మన్ గరికపాటి వెంకట్రావు,ఆంజనేయ ప్రసాద్‌ల తండ్రి గరికపాటి రాఘవయ్య చిత్రపటానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన గరికపాటి రాఘవయ్య దశదిన కర్మ ఆదివారం కరుణగిరిలో జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సతీమణి భ్రమరాంభ, తనయుడు యుగేందర్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మేయర్ నీరజ, కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు, బాలసాని లక్ష్మీనారాయణ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొని రాఘవరావు చిత్రపటానికి నివాళులర్పించారు.






