మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంలో వందశాతం ఓటింగ్
మధ్యాహ్నం 12 గంటలకే పోలింగ్ పూర్తి
జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): ఒకప్పుడు ఆ గ్రామం ఉద్రిక్తతలకు మారుపే రుగా ఉండేది. మావోయిస్టులు, పోలీస్ బలగాల బూటు చప్పుళ్ల మధ్య పల్లె గజగజ వణికేది. ఎన్నికల సమయంలో గ్రామస్తులు ఓటు వేసేందుకు జంకేవారు. అక్కడ ఎన్నికలు నిర్వహించడం నాటి ప్రభుత్వాలకు పెద్ద సవాలు. ఆ గ్రామమే జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి స్వగ్రామం ఇది. లోక్‌సభ ఎన్నిక సందర్భంగా సోమవారం గ్రామంలో వందకు వందశాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకే పోలింగ్ పూర్తికావడం మరో విశేషం. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సక్సెస్‌పై కలెక్టర్, ఎన్నికల అధికారిణి షేక్ యాస్మిన్ బాషా ఎన్నికల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.




