21-08-2025 12:50:24 AM
కాగజ్‌నగర్, ఆగస్టు (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 49 రద్దుచేసి, మూడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ తో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుంది. బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది.
ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బిజెపి నాయకులు, సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం అమలు చేసేంతవరకు దీక్ష చేపడతామన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఈ విషయంలో స్పందించాలన్నారు.