21-08-2025 12:49:06 AM
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): రైతులు సాగు చేసే పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. ఇలాంటి విపత్కర సమయాల్లో పాలకుల పరామర్శ కాకుండా మానవతా దృక్పథంతో రైతులకు భరోసా కల్పించాలని ఆయన వెల్లడించారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలిం చారు. బుధవారం జైనథ్ మండలంలో ని పెండల్వాడ, బాలపూర్, సాంగ్వి, కౌఠ తదితర పెన్ గంగా నది పరివాహక గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు వెంటబెట్టుకొని పర్యటించారు.
ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు.అనంతరం స్థానిక క్యాంపు కార్యాల యంలో ఎమ్మె ల్యే మీడియాతో మాట్లాడు తూ... రాష్ట్ర ప్రభు త్వం నష్టపోయిన రైతులకు రూ. 10,000 ఇస్తే ఎలాంటి లాభం లేదని మిగతా విత్తనాలను సబ్సిడీలో అందించాల ని సూచించారు.
అదేవిధంగా కోతకు గురైన భూములను చదును చేసుకునేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడకుండా ఉండేదని, రైతులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పేవని అన్నారు.
ఇప్పటికే రైతులు 70 నుండి 80 శాతం వరకు పెట్టుబడులు పెట్టారని, సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రకృ తి విపత్తుల సమయంలో రాజకీయాలకు వెళ్లకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.