08-11-2025 08:33:06 AM
మోతే,(విజయక్రాంతి): మద్యం మత్తులో భార్యని కర్రతో కొట్టి హత్య చేసిన సంఘటన మోతే మండల పరిధిలోని విభళాపురం గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మోతే మండలం విభళాపురం గ్రామానికి చెందిన షేక్ బందేల్లి 50 సంవత్సరాలు తాగుడుకు బానిసై శుక్రవారం మద్యం మత్తులో భార్య అయిన షేక్ కరీంబి 40 సంవత్సరాల ని మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యపై కర్రతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనితో మృతురాలి కుమారుడు షేక్ నాగుల్ మీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.