08-11-2025 08:31:04 AM
జిల్లా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ శిరీష
మోతే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు టి ఏ లు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ యన్ శిరీష అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్ లో ఏర్పాటుచేసిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం 15 విడత ప్రజా వేదికలో పాల్గొని ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయాల్లో జరిగే తప్పు ఒప్పులను సరిచూసుకునేందుకు ఆడిట్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. తెలిసి తెలియక జరిగిన పొరపాట్లను సరి చేసుకోవచ్చని కావాల్సి చేసే తప్పులను తప్పుగా పరిగణించవలసి వస్తుందని చెప్పారు. సుమారు 4, లక్షల 99 వేల రూపాయలు రికవరికి ఆదేశించినట్లు తెలిపారు. టి ఏ ల నిర్లక్ష్యం వలన రికార్డుల పరిశీలన పని ప్రదేశంలో కొలతల సమతుల్యతలో తేడాలు రావడంతో టి ఏ ల పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్లను రికవరీ 45000 దాటిన వారికి రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నామవరం గ్రామంలో పనిలో లేని వారికి అదనంగా డబ్బులు పోయాయని ప్రజావేధిక లో వెల్లడించగా సంబంధిత ఉపాధి హామీ కూలీని ప్రజా వేదికలో ప్రవేశపెట్టగా నా పేరు తప్పుగా పడిందని ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని చేసింది కాదని వెల్లడించడం జరిగింది గ్రామంలో పశువుల కొట్టం నిర్మాణం చేయుటకు అనుమతులు మంజూరు చేయగా కొట్టం నిర్మాణం చేసి ఇంటిగా వాడుకుంటున్నారని లబ్ధిదారులను వివరాలు కోరగా ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు కూలి పశువుల కొట్టంలో నివాసం ఏర్పాటు చేసుకున్నామని ప్రజా వేదికలో లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, అంబుడ్స్ మెన్ డి లచ్చి రామ్ నాయక్, ఏవీఎం లు వి. పద్మనాభం, ఆశ రాణి, క్వాలిటీ కంట్రోల్ అధికారి టి. రామకృష్ణ, ఎస్ ఆర్ పి చెన్నకేశవులు, ఏ ఈ రంగా రావు, ఏపిఎం నాగేష్, ఈసీ శ్రీహరి, టి ఏ లు రాము, సురేష్, ఊమ్లా నాయక్, గ్రామ కార్యదర్శిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.