calender_icon.png 26 July, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

25-07-2025 08:54:33 PM

హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి

హుజూర్ నగర్: వర్షాల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలను,పలు వార్డులలో డ్రైనేజీలను పరిశీలించి మాట్లాడారు...జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రజలను అప్రమత్తం చేస్తూ మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.మట్టి మిద్దెలలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండవద్దని వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలకు, ట్రాన్సఫర్మ్ లకు షాట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా వెళ్లరాదని పట్టణ ప్రజలకు సూచించారు.వర్షాల కారణంగా మున్సిపల్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.