calender_icon.png 26 July, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో కామారెడ్డి మాజీ ఎంపీపీ మృతి

26-07-2025 11:35:36 AM

  1. నివాళులు అర్పించిన మాజీ ప్రభుత్వ విప్ 
  2. కామారెడ్డి లో నిర్వహించిన అంత్యక్రియలు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి తాజా మాజీ ఎంపీపీ(Former Kamareddy MPP dies) పిప్పిరి ఆంజనేయులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అనుచరుడు పిప్పిరి ఆంజనేయులు మృతి చెందడం పట్ల గంప గోవర్ధన్ శనివారం ఉదయం పిప్పిరి ఆంజనేయులు ఇంటికి వెళ్లి  పార్థివ శవ వేటికపై పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.కె ముజీబుద్దిన్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బాలరాజు, జూ కంటి మోహన్ రెడ్డి, టేక్ రియల్ బలవంతరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  పిప్పిరి సుష్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకట్, పాత హనుమాన్లు, మండల బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.