25-07-2025 08:57:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మందులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని శుక్రవారం హాకా జనరల్ మేనేజర్ ఏ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సంఘ కార్యాలయానికి చేరుకున్న జిఎం అక్కడ రికార్డులను పరిశీలించి యూరియా సరఫరా నిలువ విక్రయాలపై ఆరా తీశారు. ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. సంఘ కార్యాలయం నిర్మాణ రికార్డులను తనిఖీ చేసి సహకార సంఘాలను సమర్థవంతంగా రైతులకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి వసంతరావు సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు